రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్‌గా అన్నావజ్జుల

రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్‌గా అన్నావజ్జుల

రెండవసారి బాధ్యతలు అప్పజెప్పిన భాజపా పార్టీ

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ గా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అన్నావజ్జుల సూర్య ప్రకాష్, కో కన్వీనర్ గా నిరంజన్ దేశాయ్ ఎంపికయ్యారు. పార్టీ కొరకు ఆయన అందించిన సేవలకు గాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రెండవ సారి ధార్మిక సెల్ కన్వీనర్ గా ఎంపిక చేయడం పట్ల భాజపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అన్నావజ్జుల సూర్య ప్రకాష్ మాటాడుతూ.. ఎంపికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవుల కోసమే కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల భూముల పరిరక్షణతో పాటు ఆక్రమణల నివారణకు కృషి చేస్తానని అన్నారు. సూర్య ప్రకాష్ ను ఎంపిక చేయడం పట్ల మహబూబాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply