వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా..

వికారాబాద్, ఆంధ్రప్రభ : పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని సామాన్య ప్రజలపై భారం పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ ఆరోపించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నిత్యవసరవస్తులు పెరిగేలా చేస్తుందని అన్నారు రాబోయే రోజుల్లో వీటి ధరలను తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి అనంతయ్య బాబు, బి నర్సింలు ఆశన్న సావిత్రమ్మ లక్ష్మీ నరసమ్మ పుష్పమ్మ బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply