Kodandaram | పవన్ సభపై కోదండరాం సీరియస్..

Kodandaram | పవన్ సభపై కోదండరాం సీరియస్..
Kodandaram | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న సభపై కొనసాగుతున్న వివాదం మధ్య ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. తెలంగాణలో ఎవరికైనా వచ్చి వెళ్లే స్వేచ్ఛ ఉందని, సమావేశాలు పెట్టుకునే హక్కు కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ స్వేచ్ఛ పేరుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించినట్లు సమాచారం.
ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని కోదండరాం ప్రశ్నించారు. ఒకరికి సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ ఉంటే, మరొకరికి అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు కూడా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ అనేది ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం అని కోదండరాం గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒకరి కృషిగా మాత్రమే చూపించే ప్రయత్నాలు సరైనవి కావని, రాష్ట్ర సాధనలో వేలాది మంది ఉద్యమకారుల పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.
