సూపర్ ఫామ్ లో టీమిండియా..

ఆసియా కప్ 2025లో నేటి పోరు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం టీ20 ప్రపంచ ఛాంపియన్స్‌గా ఉన్న భారత్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది. మరోవైపు ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) జట్టు, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకుని యుఏఈని బ్యాటింగ్‌కు ఆహ్వానించారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం సరిగ్గానే తేలింది. టీమిండియా తన బౌలింగ్ శక్తిని మరోసారి నిరూపిస్తోంది. బ్యాటింగ్‌కు వచ్చిన యుఏఈ జట్టు 11 ఓవర్లు కూడా పూర్తికాకముందే పతనం వైపు పరుగులు పెడుతోంది.
హోం గ్రౌండ్‌లో ఆడుతున్నా యుఏఈ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్ అలీషాన్ షరాఫు (22 బంతుల్లో 17), కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (19 బంతుల్లో 22) క్రీజులో నిలవలేకపోయారు. మిగతా బ్యాటర్లు అయితే కనీసం రెండంకెల స్కోర్ చేరలేకపోయారు. దీంతో 11 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి కేవలం 52 పరుగులు మాత్రమే సాధించింది ఆతిథ్య యూఏఈ జట్టు.
జట్లు..
భారత్ జట్టు:
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
యుఏఈ జట్టు:
ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాషర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిక్, ముహమ్మద్ జోహిబ్, రాహుల్ చోప్రా (వికెట్‌కీపర్), ముహమ్మద్ రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్
అయితే, 2025లో ఇప్పటివరకు కేవలం ఐదు T20Iలు మాత్రమే ఆడిన భారత జట్టు, ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌తోనే రిథమ్‌ను అందుకోవాలని చూస్తోంది. జట్టులోని 15 మందిలో 12 మంది ఆటగాళ్లు చివరిసారి ఫిబ్రవరి-మార్చి మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు ఏడాది కంటే ఎక్కువ కాలంగా టీ20ల్లో దూరంగా ఉన్నారు. వికెట్‌కీపర్ జితేష్ శర్మ కూడా 2024 జనవరి తర్వాతే తిరిగి జట్టులోకి వచ్చాడు. అయినా కూడా, ఆసియా కప్ టైటిల్‌కి భారత్ ప్రధాన ఫేవరెట్‌గా నిలుస్తోంది. ఆతిథ్య యుఏఈతో మొదటి పోరు, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో జట్టుకు సరైన టోన్ సెట్ చేసే వేదికగా మారనుంది.
మ్యాచ్ వివరాలు
ప్రారంభం: రాత్రి 8:00 గంటలకు (IST)
లైవ్ టెలికాస్ట్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: సోనీ LIV యాప్ & వెబ్‌సైట్
