( ఆంధ్రప్రభ, ఎలమంచిలి ) నిన్న గాక మొన్న అవిశ్వాసం వీగిపోవటానికి విదేశాల్లో శిబిరం నిర్వహించినా.. ఫలితం దక్కని స్థితిలో నీరసించిన వైసీపీకి.. తాజాగా ఎలమంచిలి మున్సిపాలిటీలో తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెగ్గుతామో లేదో తెలియని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. నిజానికి సొంత బలం ఉన్నప్పటికీ.. కూటమి సంధించిన కోరం అస్త్రాన్ని ఎలా తిప్పికొట్టాలో వైసీపీ శిబిరంలోని పెద్దలకు అర్థం కావటం లేదు. మరి కొన్ని గంటల్లో ఎలమంచిలి కౌన్సిల్ భేటీలో వైసీపీ నెగ్గుతుందా? వీగిపోతుదా? అనే సస్సెన్స్ ఉత్కంఠత రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీజేపీ తీర్థం తీసుకున్న ఎలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పై వైసీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం తీర్మానం పై మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది
. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి మేయర్ పదవిని అధిష్టించిన పిల్లా రమా కుమారి బీజేపీలో చేరిన విషయం విధితమే. ఇందుకు ఆగ్రహించిన 19 మంది వైసీపీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రకటించారు. నర్సీపట్నం ఆర్డీవో అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక భేటీని ఏర్పాట్లు చేశారు. చైర్ పర్సన్ పిల్లా రమాకుమారికి కూటమి ప్రభుత్వం మద్దతు తెలిపింది. 25 మంది కౌన్సిలర్లలో కొక్కిరాపల్లి, సోమలింగపాలెం కౌన్సిలర్లు రమాకుమారికి మద్దతు ప్రకటించారు.
కాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించిన కౌన్సిలర్ల లో అయిదుగురు వైసీపీ కౌన్సిలర్లు రమా కుమారి శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇచ్చేలా సుమారు పది మంది కౌన్సిలర్లను మేయర్ వర్గం చెన్నై ఇతర ప్రాంతాల తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాసం సమావేశం నిర్వహించాలంటే 2/3 వంతు కౌన్సిలర్లు హాజరు కావాలి. ఇందులో మెజారిటీ సభ్యులు అవిశ్వాసాన్ని ఆమోదిస్తే అవిశ్వాసం నెగ్గుతుంది. ఇదే జరిగితే తొలిసారిగా ఆడారి కుటుంబానికి ఎదురు దెబ్బ తగులుతుంది. విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహారం తీరుతో ఎలమంచిలిలో అవిశ్వాసాన్ని నెగ్గించడానికి వైసీపీ నాయకులు అంతగా ప్రయత్నించడం లేదని ప్రచారం జరుగుతోంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అందుబాటులోని కౌన్సిలర్లతో వైసీపీ నేతలు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేయర్ సహా టీడీపీ, జనసేన సభ్యుడితో సహా కూటమి బలం మూడుకు చేరింది. అవిశాస్వ తీర్మానంపై సంతకాలు చేసిన 19 మంది వైసీపీ కౌన్సిలర్లలో ఐదుగురు కూటమి శిబిరానికి చేరారు.
ఎక్స్ అఫిషియో సభ్యుడితో సహా కూటమి బలం 9కి చేరింది. మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లూ మేయర్ రమాకూమారికే మద్దతు పలికారు. ఈ స్థితిలో మంగళవారం నిర్వహిస్తున్న అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఎక్స్ అఫీసియో సభ్యుడు , స్థానిక శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ సహా 11 మంది గైహాజరు అయ్యే అవకాశం కనిస్తోంది. ఇక వైసీపీకి మిగిలింది 14 మంది సభ్యులే. ఈ బలం కోరం ను సంతృప్త పర్చలేవు. ఇక కోరం లేక సమావేశం నిలిచిపోతే మరో ఏడాది పాటు రమాకుమారినే చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉంది. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపాలిటీలో వైసీపీపై కూటమి అవిశ్వాసం ప్రకటించగా, ఎలమంచిలి లో అందుకు భిన్నంగా తమ పార్టీ మేయర్ పైనూ వైసీపీ అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చింది. అవిశ్వాస సమావేశంపై ఎలమంచిలి పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.