ఏజెన్సీలో తొలిసారిగా నవోదయ–సైనిక్ కోచింగ్ సెంటర్ ప్రారంభం
శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఆధునిక సౌకర్యాలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో తొలిసారిగా నవోదయ, సైనిక్ కోచింగ్ సెంటర్‌తో పాటు శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అకాడమీని మంగళవారం ప్రారంభించారు.
స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోహన్ సింగ్, నాయకులు రిబ్బన్ కట్ చేసి విద్యాసంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ సింగ్ మహారాజ్ పాల్గొన్నారు.
నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు, ఏసీ గదులు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ఆధునిక విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనతో పాటు ట్యూషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అకాడమీ ప్రిన్సిపాళ్లు పవన్, ప్రేమ్ సింగ్ తెలిపారు. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరుస్తూ నవోదయ, సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
