FIFA World Cup 2026 | అజేయ ప్రదర్శన.. ఫైనల్ కు దూసుకెళ్లిన స్పెయిన్

FIFA World Cup 2026 | అజేయ ప్రదర్శన.. ఫైనల్ కు దూసుకెళ్లిన స్పెయిన్

FIFA World Cup 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో కనబరచిని అజేయ ప్రదర్శన సెమిస్ లోనూ ప్రదర్శించి ఫైనల్ కు అర్హత సాధించింది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే బంతిపై ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్, 22వ నిమిషంలో మికెల్ ఒయార్జబాల్ పెనాల్టీ ద్వారా తొలి గోల్ నమోదు చేసింది. రెండోార్థంలో 58వ నిమిషంలో పెడ్రో పోరో మరో గోల్ సాధించి స్పెయిన్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాప్పే నేతృత్వంలోని దాడులను స్పెయిన్ రక్షణ పూర్తిగా కట్టడి చేసింది.

లీగ్ దశ నుంచి ఒక్క ఓటమి లేకుండా కొనసాగుతున్న స్పెయిన్, నాకౌట్ దశలో కూడా అదే జోరును కొనసాగించింది. దీంతో 2010 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో ఇంగ్లాండ్-అర్జెంటీనా సెమీఫైనల్ విజేతతో స్పెయిన్ తలపడనుంది. ఫ్రాన్స్ మాత్రం మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడనుంది. గత సీజన్ లో ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై ఓడిపోయారు. మరోసారి సెమిస్ ఓడిపోవడంతో అభిమానులక నిరాశ తప్పలేదు.