Kadem | గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు బొంతల లక్ష్మి భూమ‌న్న‌ ప్ర‌చారం

Kadem | కడెం, ఆంధ్రప్రభ : త‌మ‌కు ఓటు వేసి గెలిపించాల‌ని బెల్లాల్ జిపి సర్పంచ్ అభ్యర్థి బొంతల లక్ష్మి డాక్టర్ భూమన్న ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. త‌మ‌కు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలన్నారు. సోమవారం కడెం మండలం బెల్లాల్, నర్సింగాపూర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి బొంతల లక్ష్మి భూమన్న యాదవ్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లను, ప్రజలను కలుస్తూ కత్తెర గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తమను గెలిపించుకోవాలని ఆమె బెల్లాల్ గ్రామ పంచాయ‌తీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply