కదంబం సింగిల్‌ మాల్ట్‌ విస్కీని విడుదల చేసిన అమృత్‌ డిస్టిలరీస్‌, మోనికా ఆల్కోబెవ్‌

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : మోనికా ఆల్కోబెవ్‌ లిమిటెడ్‌ సహకారంతో అమృత్‌ డిస్టిలరీస్‌ జిఎంఆర్‌ హైదరాబాద్‌ డ్యూటీ ఫ్రీలో అమృత్‌ కదంబం విస్కీని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఈ ఆవిష్కరణ ప్రీమియం ఇండియన్‌ విస్కీ ప్రపంచంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

ప్రయాణికులకు అమృత్‌ అత్యుత్తమ సృష్టిలలో ఒకదాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది.

ఈ సందర్భంగా అమృత్‌ డిస్టిలరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రక్షిత్‌ ఎన్‌. జగ్డేల్‌ మాట్లాడుతూ… జిఎంఆర్‌ హైదరాబాద్‌ డ్యూటీ ఫ్రీలో అమృత్‌ కదంబం ప్రత్యేక ఆవిష్కరణ, ట్రావెల్‌ రిటైల్‌ రంగంలో ప్రత్యేకమైన ఆఫర్‌లను అందించడంలో తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. అమృత్‌ను నిర్వచించే పనితనం, ఆవిష్కరణలకు ఉదాహరణగా కదంబం నిలుస్తుందన్నారు. ప్రపంచ ప్రయాణికులకు చిరస్మరణీయ అనుభవంలో భాగంగా దీనిని పరిచయం చేయడానికి తాము సంతోషిస్తున్నామన్నారు.

మోనికా అల్కోబెవ్‌ లిమిటెడ్‌ ఎండి అండ్‌ సీఈఓ కునాల్‌ పటేల్‌ మాట్లాడుతూ… జిఎంఆర్‌ హైదరాబాద్‌ డ్యూటీ ఫ్రీలో అమృత్‌ కదంబం ఆవిష్కరణకు ప్రత్యేక పంపిణీ భాగస్వామిగా ఉండటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. అమృత్‌ విస్కీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పెరుగుతూనే ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగం కావడం తమకు మరింత సంతోషంగా ఉందన్నారు. అమృత్‌ కదంబం విభిన్న మిశ్రమం జిఎంఆర్‌ హైదరాబాద్‌ డ్యూటీ ఫ్రీ ప్రత్యేక ఆఫరింగ్స్‌ కు సరైన జోడింపుగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులతో దీనిని పంచుకోవడానికి తాము ఎదురు చూస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *