జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చిక వెంకటేశ్వర్లు
సంగెం, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల ఐక్యతతోనే వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చిక వెంకటేశ్వర్లు అన్నారు. సంగెం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజానికి సరైన సమాచారాన్ని అందించడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పత్రికా విలువలను కాపాడుతూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, అందరి సమక్షంలో సామరస్యపూర్వకంగా జరగడం అభినందనీయమన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జర్నలిస్టు సహకరించాలని కోరారు.
అనంతరం సంగెం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా వేల్పుల అనిల్ యాదవ్ (ప్రజాజ్యోతి), ఉపాధ్యక్షుడిగా బాషీపాక రాములు, ప్రధాన కార్యదర్శిగా మచ్చిక విరస్వామి (సూర్య) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
నూతన అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో పాటు జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి గాయపు రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు సధిరం కుమారస్వామితో పాటు సిద్ధ నాగరాజు (నిఘా), మందపూరి బలరామ్ (తెలంగాణ గళం), హరి (ఏబీ న్యూస్), ఏలీయా (ప్రభంజన పదం), విజయ్ (సామాజిక తెలంగాణ), ఐతే కుమార్ (శుభోదయం), మండ వేణు (ప్రజాపక్షం), వేల్పుల నాగరాజు (ప్రజాదర్బార్), పుల్ల సతీష్ (అక్షర విజేత) తదితరులు పాల్గొన్నారు.
