మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు

మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మహిళలు తమ కాళ్లపై నిలబడి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునే లక్ష్యంతో కృష్ణా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక వాణిజ్య సముదాయం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక వెల్లడించారు. జిల్లా పరిషత్ నుంచి 15 శాతం స్త్రీ మరియు శిశు సంక్షేమ నిధుల కింద రూ.2 కోట్ల వ్యయంతో ఈ వ్యాపార సముదాయం నిర్మించబడింది.

ఈ సముదాయాన్ని చైర్పర్సన్ ఉప్పల హారికతో పాటు జాయింట్ కలెక్టర్ యమ్. నవీన్, జడ్పీటీసీ సభ్యులు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల హారిక మాట్లాడుతూ, మహిళలు చిరు వ్యాపారాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ షాపింగ్ సముదాయం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply