Rain | వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు..
Rain | బాసర (ఆంధ్రప్రభ): మండల కేంద్రంలో గత ఇరవై రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు సాగు చేసిన సోయాబీన్ పంటలు, వరి నారుమడులు ఎండిపోతున్నాయి. దీంతో బుధవారం గ్రామ రైతులు, గ్రామస్థులు కలిసి గ్రామదేవతలు, మహా పోచమ్మ అమ్మవారికి గోదావరి జలాలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించారు.
గోదావరి నది వరకు భజన బృందాలు, బాజాభజంత్రీలతో సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా వెళ్లిన రైతులు, గ్రామ పెద్దలు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి జలాలను తీసుకువచ్చి సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు గ్రామదేవతలు, పోచమ్మ ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి, పంటలు కాపాడేలా వర్షాలు కురవాలని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.



