కనకదుర్గమ్మను దర్శించుకున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

  • ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమేష్‌ చంద్ర లడ్డా
  • కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి రాక…
  • ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ చంద్ర లడ్డా ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఉమేష్‌ చంద్ర లడ్డా కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వి.కె. శీనా నాయక్‌ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.