ఆంధ్రప్రభ కథనానికి స్పందన..

ఆంధ్రప్రభ కథనానికి స్పందన..
- దివ్యాంగుల కోసం వీల్ చైర్ ఏర్పాటు
బాసర(నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; రెండు రోజుల క్రితం ఆంధ్రప్రభ లో పనిచేయని వీల్ చైర్ ఇబ్బందుల్లో దివ్యాంగులు అనే కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. ఆదివారం నూతనంగా రెండు వీల్ చైర్లను దివ్యాంగుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తారు. వీరిలో దివ్యాంగులు సైతం పదుల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారు. వీరికి పనిచేయని వీల్ చైర్ అందుబాటులో ఉండడంతో పలువురు దివ్యాంగులు అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు రెండు వీల్ చైర్ లను ఆలయ ప్రాంగణంలో ఉంచడంతో దివ్యాంగ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
