అష్టమి పర్వదినంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

అష్టమి పర్వదినంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన అర్చకులు..
పాల్గొన్న ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయం ముందు ఉన్న రావిచెట్టు వద్ద కొలువై ఉన్న క్షేత్రపాలక శ్రీ ఆంజనేయస్వామికి విశేష అభిషేకం, నాగవల్లి దళార్చన వైభవంగా నిర్వహించారు.
ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువుల్లో దేవస్థానం ఈవో వీకే శీనానాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా ఘాట్ రోడ్ ఆంజనేయస్వామి ఆలయంలోనూ, అమ్మవారి పాత మెట్ల వద్ద కొలువై ఉన్న ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

