Illegal cases | సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

Illegal cases | సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

Illegal cases | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశంలో మానవ అక్రమ రవాణా (Human Trafficking) నిరోధం, అలాగే సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలో ఉన్న వయోజనులు మరియు బలవంతపు అక్రమ రవాణా బాధితుల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని పోలీసు వ్యవస్థకు సూచించింది.

స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వయోజనులపై అక్రమ కేసులు నమోదు చేయరాదని.. బలవంతం, మోసం లేదా దోపిడీ ద్వారా వృత్తిలోకి లాగబడిన వారిని మాత్రం రక్షించాల‌ని ఆదేశించింది. పోలీసు దర్యాప్తులో ఈ రెండు విష‌యాల మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించాల‌ని సూచించింది.

వయోజన సెక్స్ వర్కర్లను కేవలం వారి వృత్తి ఆధారంగా వేధించడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో చట్టబద్ధ ప్రక్రియను అనుసరించాలని సూచించింది. అక్రమ రవాణా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రక్షణ చర్యల సమయంలో సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయరాదని తెలిపింది. ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడం గోప్యత ఉల్లంఘనగా పరిగణించవచ్చని హెచ్చరించింది.

మైనర్లను అక్రమ రవాణా నుంచి రక్షించడం అత్యంత ప్రాధాన్యమని ధర్మాసనం స్పష్టం చేసింది, స్వచ్ఛంద సెక్స్ వర్క్‌లో ఉన్న వయోజనుల కారణంగా వారి పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేయరాదని సూచించింది.

Leave a Reply