10grams| బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

10grams| బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పసిడి ప్రియులకు భారీ శుభవార్త. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా బంగారం ధరలు భారీ మార్పులు సంభవిస్తున్నాయి. తాజాగా మంగళవారం కూడా ధరలు తగ్గాయి. 24-క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 820 తగ్గింది. ప్రస్తుతం దాని ధర రూ. 1,49,840 గా ఉంది. అలాగే 22-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర అంటే రూ. 750 మేర తగ్గింది. ప్రస్తుతం రూ. 1,37,350గా ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 610 తగ్గింది. ప్రస్తుతం రూ. 1,12,380గా ఉంది. మరోవైపు, నాలుగు రోజుల స్థిరత్వం తర్వాత వెండి ధర ఈరోజు రూ.5000 తగ్గింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక గ్రాము వెండి ధర ₹255 గాను, ఒక కిలో వెండి ధర ₹2,55,000 గాను ఉంది.
