HYD | విపక్షాల ట్రాప్ లో పడొద్దు..
HYD | విపక్షాల ట్రాప్ లో పడొద్దు..
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏ ఒక్కరికి నష్టం కలిగించమని, బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ… ఎవరినీ నిరాశ్రయులను చేయడం తమకు ఇష్టం లేదన్నారు. మూసీ పరిధిలో ఉన్న అందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. మెరుగైన జీవన విధానానికి కావాల్సిన ప్రమాణాలు కల్పిస్తామన్నారు. విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తాం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. మూసీ పరివాహకంలో ఉన్న అందరికీ న్యాయం చేస్తామన్నారు. రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడవద్దని మూసీ ప్రాంత ప్రజలను కోరుతున్నామన్నారు.
దూరం తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు వేస్తున్నామన్నారు. సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్ కారిడార్లు వస్తాయన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల వల్ల హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థను మారిస్తే మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందన్నారు. ప్యూర్ రీజియన్‌లో పరిశ్రమలు ఉంటాయన్నారు. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు.
క్యూర్లో సర్వీస్ సెక్టార్, ప్యూర్‌లో ఇండస్ట్రియల్ సెక్టార్, రేర్‌లో అగ్రికల్చర్ సెక్టార్ అన్నారు. ఆన్లైన్లోనే లెసెన్సులు రెన్యువల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి విషయం వచ్చేసరికి అందరూ ఒక్కటి కావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడదామన్నారు. పరిపాలన అంతా ఒకే గొడుగు కిందకు తెచ్చామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలన్నారు.
సబర్మతి, యమున, గంగాను ప్రక్షాళన చేస్తామని అక్కడి సీఎంలు చెబుతున్నారన్నారు. గుజరాత్ అభివృద్ధిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిచ్చిందన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ల విస్తరణకు ఇబ్బందులున్నాయన్నారు. సిగ్నల్స్ వైపు ఆగకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. చిరువ్యాపారులకు ఇతర చోట్ల స్థలం కేటాయిస్తామన్నారు. పలుచోట్ల మల్టీ లెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హిల్ట్ పాలసీ కింద పరిశ్రమలకు వినియోగ మార్పిడి చేస్తున్నామన్నారు. సర్వీస్ సెక్టార్‌గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
