Weather Alert | ఏపీ, తెలంగాణలో వర్షాలు
Weather Alert | ఏపీ, తెలంగాణలో వర్షాలు
Weather Alert | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రానున్న 2 గంటల్లో సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, రంగారెడ్డి (ఆమన్‌గల్, మంచాల్), మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకునే ఈ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ సాయంత్రం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానలు పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ఏపీలోని కర్నూల్, అనంతపురం, సత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది.
