csk captain| రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌

csk captain| రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ప్రారంభానికి కొన్నిరోజుల ముందు నుంచి ప్ర‌తీసారి ఓ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంది. అది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ ఆటగాడు, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి. ఈసారి ఆడ‌తాడా లేదా.. రిటైర్మెంట్ తీసుకుంటాడా..? అని వార్త‌లు వ‌స్తుంటాయి. కానీ వీట‌న్నింటికీ ధోని పులిస్టాప్ పెడుతూ.. ప్ర‌తీ సీజ‌న్‌లో బ‌రిలో దిగుతున్నారు. 2026 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆడ‌టానికి ధోనీ సిద్ధ‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ధోనీ తన రిటైర్మెంట్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో 60 ఏళ్ల వయసు వచ్చినా ఆడుతూనే ఉంటానేమోనంటూ ఆయన సరదాగా మాట్లాడారు.

చెపాక్‌లో నిన్న‌ జరిగిన సీఎస్‌కే ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు శివకార్తికేయన్, రిటైర్మెంట్ ఆలోచనలు పక్కనపెట్టి మరికొన్నేళ్లు సీఎస్‌కే పసుపు జెర్సీలో కొనసాగాలని ధోనీని కోరారు. దీనికి ధోనీ బదులిస్తూ… “ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా కంగారు పడకండి… నేను 60 ఏళ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోవద్దు” అని అన్నారు.