ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది..ఇక విదేశీ పర్యటనలో బాగంగా ఈరోజు ఆయన అమెరికా బయల్దేరారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ ఇప్పుడు అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి చేరుకోగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ వీడ్కోలు పలికారు.

వాషింగ్టన్ DCలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు వివిధ రంగాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.