Nifty90points | గ్లోబల్ ప్రభావంతో నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

Nifty90points | గ్లోబల్ ప్రభావంతో నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
Nifty90points | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎగసిపడటం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
ఈరోజు ఉదయం 09:29 గంటల సమయానికి నిఫ్టీ 90 పాయింట్లు తగ్గి 24,238 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్ 296 పాయింట్లు కోల్పోయి 77,546 వద్ద ట్రేడవుతోంది. కీలక రంగాల షేర్లలో అమ్మకాలు పెరగడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 98.2 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.1 డాలర్లకు చేరింది. అలాగే యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.39 శాతానికి పెరగడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
ఇక గడిచిన ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు కూడా బలహీనంగా ముగిశాయి. యూఎస్ ఎస్‌అండ్‌పీ సూచీ 0.38 శాతం తగ్గగా, నాస్‌డాక్ 0.13 శాతం నష్టపోయింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ ప్రతిఫలిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
