ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి ఎదగగలం

ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి ఎదగగలం

  • అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

కడెం, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కడెం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి అంచెలంచెలుగా ఎదిగి, తహసీల్దార్‌గా ప్రారంభించి ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యాబోధన అందుతోందని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దానికోసం కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో నిర్వహించిన వెల్ఫేర్ డే వారోత్సవాల సందర్భంగా ఉపన్యాసం, వ్యాసరచన తదితర పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. లచ్చిరాం, ఎంఈఓ షేక్ హుస్సేన్, ఎంపీవోటీ శ్రీనివాస్, కేజీబీవీ ఎస్‌ఓకే విమల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply