విద్యుత్ రాయితీపై ఆక్వా రైతుల హర్షం..
- రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు
పాలకొల్లు, ఆంధ్రప్రభ : గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న విద్యుత్ రాయితీ జీవోను కూటమి ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన సందర్భంగా ఆక్వారైతులంగా హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘ సమావేశానికి రాష్ట్ర మంత్రులు అచెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు . భారీ బహిరంగ సభకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు.

ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల తారతమ్యం, ఇటువంటి నిబంధనలు లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ యూనిట్ ధర రు. 1.50 లకు అందించే విధంగా జీవోను అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీలకు ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత జగన్ సర్కారులో జరిగిన వైఫల్యాలను సరిదిద్దుతూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, ఆర్డీవో దాసిరాజు, డి.ఎస్.పి ఎం.సుధాకరరావు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, పులపర్తి వీరాంజనేయులు ( అంజిబాబు ), బొలిశెట్టి శ్రీనివాస్, గన్ని వీరాంజనేయులు, ఆరుమిల్లి రాధాకృష్ణ, వరప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.
