Gudivada | సెమీ క్రిస్మస్ వేడుకలు..

Gudivada | సెమీ క్రిస్మస్ వేడుకలు..

Gudivada, ఆంధ్రప్రభ : గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి సహచార ఉద్యోగులకు మున్సిపల్ సిబ్బందికి, పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిబ్బంది ఆధ్వర్యంలో క్యాండిల్ సర్వీస్ నిర్వహించి క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మాట్లాడుతూ.. మనతో పాటు మన తోటి వారిని ప్రేమించాలని క్రీస్తు అందించిన సువార్తను ప్రతి ఒక్కరు తమ జీవితంలో అలవర్చుకోవాలన్నారు. క్రీస్తును ఆరాధించడమే కాదు క్రీస్తు చెప్పిన మార్గాన్ని సైతం అనుసరించేలా మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అసిస్టెంట్ కమిషనర్ కే శరత్ చంద్ర, పురపాలక సంఘ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్, అకౌంట్ ఆఫీసర్ జి టి నాయుడు, మేనేజర్ శ్రీమతి నిర్మల కుమారి, పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.