Gudivada | సమ్మెను జయప్రదం చేయండి

Gudivada | సమ్మెను జయప్రదం చేయండి

Gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : సిఐటియూ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున జరిగే సమయం జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.సి.పి.రెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఆదివారం గుడివాడ సిఐటియూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రెడ్డి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు.

కార్మిక, కర్షగా సంఘాలన్నీ ఐక్యంగా పోరాడితేనే కార్మిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్స్ ను కరోనా సమయంలో పార్లమెంట్లో ఆమోదం పొందడం జరిగిందని అప్పటినుండి అమలు చేయకుండా బీహార్ ఎన్నికలు గెలుపొందిన తర్వాత నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి పూనుకోవడం దుర్మార్గం అన్నారు. ఇతర సవరణ చట్టం పార్లమెంట్లో రైతులు ఆమోదం లేకుండా బిల్లు పాస్ చేయడానికి ఖండించారు. ఉపాధి హామీ చట్టాన్ని అనేక మార్పులు చేసి వి బి జి రాంజీ పేరుతో చట్టాన్ని మార్చడం దుర్మార్గమన్నారు ఈ సమస్యలపై దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సురేంద్ర ,విజయ్ కుమార్, నారాయణ, ప్రసాద్, విశ్రాంతి ఉద్యోగులు వెంకటేశ్వరరావు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply