Greetings | విలువల‌తో కూడిన పార్టీ జ‌న‌సేన – ప‌వ‌న్ కు చంద్ర‌బాబు విషెస్ ..

వెల‌గ‌పూడి -జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పవన్‌కు సీఎం విషెస్ చెప్పారు. జనసేన నిబద్ధత విలువలతో కూడిన రాజీకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న పార్టీ అని అన్నారు. 12 సంవత్సరాలు ఆవిర్భావ వేడుకల సందర్బంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు, జన సైనికులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా,మంత్రి నారా లోకేష్ కూడా జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.. జనసేనకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంటుందని మంత్రి లోకేష్ అభిల‌షించారు.

Leave a Reply