అగ్నిమాపక సిబ్బందికి ఘన సన్మానం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అగ్నిమాపక వారోత్సవాలు (ఏప్రిల్ 14 నుంచి 20 వరకు) సందర్భంగా రఘునాథపల్లి వాసవి క్లబ్, వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు. వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సేవలను కొనియాడుతూ వారిని శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్బంగా వాసవి క్లబ్ అధ్యక్షులు కూరెళ్ల పెద్ద ఉపేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడడంలో చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి పజ్జురి రాజు, కోశాధికారి లగిశెట్టి లింగయ్య పాల్గొన్నారు. అలాగే వనిత క్లబ్ అధ్యక్షురాలు కూరెళ్ళ రేణుక, ప్రధాన కార్యదర్శి పోకల లావణ్య, కోశాధికారి కూరెళ్ళ ఉషతో పాటు క్లబ్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply