ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెలమ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీరాబాయి, మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో ముత్యాల నాగరాజు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ జి. మన్మధకుమార్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ నందగిరి వెంకటేశం, మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ శివస్వరూపారాణి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. బీజేపీ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్యయాదవ్, బీఆర్‌ఎస్ మున్సిపల్ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, నేలపట్ల చేనేత సహకార సంఘంలో చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్, చౌటుప్పల్ సంఘంలో చైర్మన్ బడుగు మోహన్‌బాబు జెండాలను ఆవిష్కరించారు. మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో సర్పంచులు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో అధ్యక్షులు, కార్యదర్శులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.