నవాబుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నవాబుపేట, ఆంధ్రప్రభ: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో జయరాములు నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారలింగం, మండల విద్యాధికారి నాగ్య నాయక్, ఎస్సై నరేందర్, ఆయా పార్టీల అధ్యక్షులు సురేష్, నర్సింహులు, లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ శ్రీనయ్య, సర్పంచులు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
