బీజేపీ బూత్ అధ్యక్షులకు ఘన సత్కారం..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలోని 115, 116 ఎన్నికల బూత్‌లలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పెనుగొండలోని బూత్‌లను సందర్శించిన బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ పత్రాలను అత్యంత అప్రమత్తంగా పరిశీలిస్తూ, బీఎల్ఓ లకు సమర్పిస్తున్న బూత్ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ముత్యం ఉమేష్ గౌడ్ ను మంగళవారం శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉప్పునూతుల రమేష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫార్మ్స్ నమోదు ప్రక్రియ ప్రారంభమైన రోజు నుండి ముత్యం ఉమేష్ గౌడ్, పేరాల సురేష్‌లు ఎంతో నిబద్ధతతో, నిరవిరామంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్లను అరికట్టడంలో , నూతన ఓటర్లను చేర్చటంలో వీరిద్దరూ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం పార్టీ బాధ్యత అని రమేష్ పేర్కొన్నారు.
సమయం తక్కువగా ఉంది.. అప్రమత్తంగా ఉండాలి:
ఓటర్ల జాబితా సవరణకు సమయం చాలా తక్కువగా ఉన్నందున, క్షేత్రస్థాయిలో ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి ఎలాంటి తప్పులకు తావులేకుండా సక్రమమైన ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలని ఉప్పునూతుల రమేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు, జమ్ముల గోపాల్ రెడ్డి, వార్డ్ మెంబర్, పొనుక సోమరాజ్ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
