ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా అకాడి పూజలు..

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం అకాడి పూజలను ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడ మండలంలోని బాదిగూడ గ్రామ ఆదివాసీలు గ్రామ పొలిమేరకు వెళ్లి వనదేవతలకు, రాజుల్ దేవత వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం సంప్రదాయ వంటకాలను తయారు చేసి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండటంతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు గ్రామ ఆదివాసీ పెద్దలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ శ్రేయస్సు కోసం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ సిడాం లక్ష్మీకాంత్, దేవరి పేందుర్ బండు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.