వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే..
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. మండలంలోని గ్యామాతండా సర్పంచ్ భూక్య వినోద- వీరు నాయక్ ల కుమార్తె తులసి-విజయ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం లోక్యతండ గ్రామ పంచాయతీకి చెందిన బానోతు లచ్చిరాం-రేణుక కుమార్తె స్వాతి-అఖిల్ ల వివాహానికి హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట,సుఖాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల యూత్ అధ్యక్షుడు బండి రమేష్,ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకులు లక్పతి,మంచాల శ్రీశైలం తదితరులు ఉన్నారు.
