29న అమ్మవారికి కల్యాణ మహోత్సవం..

29న అమ్మవారికి కల్యాణ మహోత్సవం..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని పెరికకుల సంఘం ప్రతినిధి ప్రొఫెసర్ వడ్డే రవీందర్ అన్నారు. ఆదివారం 33వ డివిజన్ పెరిక వాడ కళ్యాణ మండపంలో దిద్ది నరేందర్ అధ్యక్షతన పెరిక కులస్తుల సమావేశం నిర్వహించారు. శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల కరపత్రిక పెరిక కుల బాంధవులు ఆవిష్కరించారు.

ఈనెల 19 ఆదివారం నుండి ఏప్రిల్ 30 వరకు భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఏప్రిల్ 29 బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పెరికకుల (పురగిరి క్షత్రియ) సంఘం ఆధ్వర్యంలో ఉదయం శరభ వాహన సేవ, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంకాలం పుష్ప రధసేవ పెరిక కుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున ఉమ్మడి జిల్లా కుల బాంధవులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దిడ్డి నరేందర్, దిడ్డి కుమారస్వామి, అచ్చ వినోద్ కుమార్, చింతం యాదగిరి, బిల్ల రవి, దిద్ది రమేష్, రవి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply