మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి

మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి
- డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
నస్పూర్, ఆంధ్రప్రభ ; అమూల్యమైన ఓటువేసి కాంగ్రెస్ పొత్తులో భాగమైన సిపిఐ అభ్యర్థి మేకల అశ్విని-దాసుకు మరో అవకాశం ఇస్తే అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తారాని డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆదివారం ప్రచారంలో భాగంగా 6వ డివిజన్ లో ఇంటింటికి ప్రచారం చేశారు. అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని సిపిఐ పార్టీ 6వ డివిజన్ అభ్యర్థి మేకల అశ్విని-దాసు లు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తనకు మరోక్కసారి అవకాశం కల్పించి కార్పొరేటర్ గా గెలిపిస్తే ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో తాము కృషి చేస్తానని, ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముందజలో ఉంటామన్నారు. గెలిపిస్తే 6వ డివిజన్ అభివృద్ధి బాధ్యతలు తామే తీసుకుంటాం అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి, జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు కొట్టే కిషన్రావు,దొడ్డిపట్ల రవీందర్ పూజారి రామన్న, కొత్తపల్లి మహేష్ చిలక రామచందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
