జాతీయ జెండా మన దేశ గౌరవానికి ప్రతీక
- జెండా ఆవిష్కరణ మనందరి గర్వకారణం: డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్‌రెడ్డి, వేముల కృష్ణయ్య, సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రాములు యాదవ్, సాయిబాబా, ధోమ పరమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్లు ఎంపీ ప్రవీణ్‌కుమార్, ఫయాజ్, ఫక్రూ, తాహెర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల రాజు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, డీసీసీ సభ్యులు కంచిమి లక్ష్మణ్, గోపాల్ యాదవ్, ఉషారాణి, కలీం, కాంగ్రెస్ నాయకులు అబ్రార్ హుస్సేన్, వినయ్‌కుమార్, చందు యాదవ్, మురళిగౌడ్, హరినాథ్, ఎన్‌పీ నేహా, గంజి అంజనేయులు, బండి మల్లేష్, నూర్ భాయ్ తదితరులు హాజరయ్యారు. ఓబీసీ సెల్ నాయకులు టీసీ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు సల్మాన్, ముస్తాక్, సేవాదళ్ నాయకులు అబూకర్, జగదీష్, అలీ, వెంకటలక్ష్మి, సంజు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో డీసీసీ కార్యాలయ ప్రాంగణం మార్మోగింది.
