తెప్ప బోల్తాపడి.. మత్స్యకారుడు మృతి…

వజ్రపుకొత్తూరు(పలాస), ఆగస్టు 13( ఆంధ్రప్రభ) : వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు సూరాడ విశాఖ(58) సముద్రంలో చేపల వేటకు వెళ్లగా బోటు బోల్తా పడటంతో అయన మృత్యవాత పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో కొండ పూర్ణారావు తెప్పలో ఆయనతో పాటు వంక చిరంజీవులు, సూరాడ విశాఖ కలసి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.

వేట ముగించుకుని తిరిగి తీరానికి చేరుకునే క్రమంలో అలల ఉధృతికి తెప్ప బోల్తాపడింది. దీంతో తెప్ప పై నుంచి ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. ఈ క్రమంలో సూరాడ విశాఖ మృతిచెందాడు. మృతునికి భార్య దానమ్మ, దత్త పుత్రుడు రాజు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు స్వాతి, ప్రేమకు వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్సై బి నీహార్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.