cricket | జైస్వాల్ , ష‌ఫాలీ వ‌ర్మ‌కు నోటీసులు

cricket | జైస్వాల్ , ష‌ఫాలీ వ‌ర్మ‌కు నోటీసులు

cricket |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భార‌త స్టార్ క్రికెట‌ర్లు చిక్కుల్లో ప‌డ్డారు. భార‌త యువ క్రికెట‌ర్‌ య‌శ‌స్వి జైస్వాల్‌, మ‌హిళా క్రికెట‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ‌కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడీఏ) షాక్ ఇచ్చింది. గ‌త ఏడాది ఆ ఇద్ద‌రూ డోపింగ్ ప‌రీక్ష‌లకు హాజ‌రుకాలేదని నోటీసులు జారీ చేసింది. అయితే ఆ ప‌రీక్ష‌ల‌కు ఎందుకు మిస్స‌యార‌న్న విష‌యాన్ని ఇంత వ‌ర‌కు ఆ క్రికెట‌ర్లు వెల్ల‌డించ‌లేదు. డోపింగ్ పరీక్షల కోసం తమ ఆచూకీ (వేర్ అబౌట్స్) తెలపడంలో విఫలమవ్వడం, అలాగే అధికారులు పరీక్షల కోసం వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో నాడా ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ ఐపీఎల్‌లో బిజీగా ఉండగా.. షఫాలీ వర్మ ప్రపంచకప్ విజయానంతరం విరామంలో ఉంది.

క్రికెట‌ర్ల‌కు నోటీసులు ఇవ్వ‌డ‌మే కాకుండా, ఈ అంశం గురించి బీసీసీఐ, ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు నాడా చెప్పింది. డోప్ ప‌రీక్ష‌ల‌కు మిస్సైన అంశం గురించి నాడా నోటీసు అందిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, ఇక ఆ మెగా క్రీడ‌ల ప్రోటోకాల్ ప్ర‌కారం అన్ని ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కావాల‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు.

ఒక‌వేళ ఆట‌గాళ్లు వ‌రుస‌గా మూడు సార్లు డోపింగ్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాకుంటే, అప్పుడు వాళ్ల‌ను స‌స్పెండ్ చేసే అవ‌కాశాలు ఉంటాయి. ఒక‌వేళ మూడో సారి కూడా డోపింగ్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాకుంటే, ఆ ఆట‌గాళ్ల‌పై రెండు నిషేధం విధిస్తారు. నిషేధిత ఉత్ప్రేర‌కం టెర్బుట‌లైన్ వాడ‌డం వ‌ల్ల క్రికెట‌ర్ పృథ్వీ షాపై 2019లో 8 నెల‌ల బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే.

Leave a Reply