బ్యాంకులో చెలరేగిన మంటలు

బ్యాంకులో చెలరేగిన మంటలు

  • కాలిపోయిన సామాగ్రి, ఫర్నిచర్
  • పాక్షికంగా కాలిపోయిన కంప్యూటర్స్
  • నగదు, బంగారానికి నష్టం జరగలేదు : మేనేజర్
  • హుటా హుటన ఘటన స్థలికి అగ్నిమాపక సిబ్బంది

గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇండియన్ బ్యాంక్ లో శుక్రవారం ఉదయం వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాంకు నుండి దట్టమైన పొగలతో మంటలు బయటికి వ్యాపించాయి. బ్యాంకులో మంటలు చెదిరేగిన ఘటనను స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి…. బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక మార్కండేయ కాలనీలోని ఇండియన్ బ్యాంక్ వద్దకు చేరుకున్నారు.

సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. బ్యాంకులో తలెత్తిన అగ్నిప్రమాదం మూలంగా కొంత మేరకు సామాగ్రి ఫర్నిచర్ కాలిపోయింది. అదేవిధంగా బ్యాంకులోని కొన్ని కంప్యూటర్స్ పాక్షికంగా కాలిపోయినట్లు బ్యాంకు మేనేజర్ సౌరబ్ తెలిపారు. మేనేజర్ క్యాబిన్ తోపాటు కంప్యూటర్స్ ఆపరేటింగ్ చేసే సర్వర్ రూమ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు బ్యాంకు మేనేజర్ సౌరవ్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా బ్యాంకులో ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో సదరు ఇండియన్ బ్యాంక్ కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న కస్టమర్లు కూడా ఘటన స్థలికి చేరుకున్నారు. అయితే…. బ్యాంకు కు సంబంధించి పత్రాలు, బంగారం, నగదుకు ఎలాంటి మంటలు అంటుకోలేదని… ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ భరోసా ఇచ్చారు. ఖాతాదారులు సంయమనం పాటించి బ్యాంకు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

పేపర్ ప్రింటింగ్ లో ఉపయోగించే క్యాటరేజ్ డ్రై కావడంతో వేడికి ఫైర్ జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి లక్ష్మీనారాయణ చెప్పారు. సరైన సమయంలో సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసినట్లు ఆయన తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ తో ఫర్నిచర్ తోపాటు కంప్యూటర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని సకాలంలో స్పందించడంతో భారీ ఆస్తి నష్టం తప్పిందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా బ్యాంకులో చెలరేగిన మంటలతో కొంతమేరకు సామాగ్రి ఫర్నిచర్ కాలిపోవడం తప్ప బ్యాంకులోని నగదు బంగారానికి ఎలాంటి మంటలు అంటుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply