నిజాంపేట అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలోనే మంజూరు

  • మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

నిజాంపేట, ఆంధ్రప్రభ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట మండలానికి పలు అభివృద్ధి పనులు మంజూరయ్యాయని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేటలో ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నిజాంపేట మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరైనప్పటికీ, దాని ఏర్పాటులో ప్రస్తుత ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సౌకర్యార్థం పీహెచ్‌సీ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పటికే ప్రొసీడింగ్స్ జారీ చేసిందని తెలిపారు.

గతంలో మంజూరైన అభివృద్ధి పనులకే ఇప్పుడు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. రామాయంపేట డివిజన్ ఏర్పాటు కోసం కృషి చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గేరిగంటి అనూష భర్త లక్ష్మీనర్సింలు, బీఆర్ఎస్ కార్యకర్త పంపరి శంకరయ్యలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, బీఆర్ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు బజార్ రంజిత్ గౌడ్, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, సొసైటీ చైర్మన్ బాపు రెడ్డి, మాజీ సర్పంచ్ గేమ్ సింగ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, నాయిని లక్ష్మణ్, పున్న వెంకటస్వామి, బండారి తిరుమల్, నరేందర్ నాయక్, పంపరి శివకుమార్, సుభాష్ నాయక్, బొప్పాపురం జీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.