కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర చారికి సన్మానం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రురు మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మోత్కూరు రవీంద్ర చారిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీంద్ర చారి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి, ముద్దం మహబూబ్ రెడ్డి, వెన్నెం సోమిరెడ్డి వెంకటపురం కాంగ్రెస్ నాయకులు తునికి వెంకన్న, రాయిపెళ్ళి సదానందం, మద్దెల సురేష్, మహిబూబ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
