Fight for Better | నూతన సంవత్సర వేడుకలు….

Fight for Better | నూతన సంవత్సర వేడుకలు….

Fight for Better | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లా రామగుండం పరిధిలోని తబితా ఆశ్రమంలో 2026 నూతన సంవత్సర వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఫైట్ ఫర్ బెటర్(Fight for Better) సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆశ్రమంలోని పిల్లల మధ్య నూతన సంవత్సర కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన మద్దెల దినేష్, ఆశ్రమంలో ఉన్న పిల్లలందరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

పిల్లల భవిష్యత్తు(future) మెరుగుపడాలని, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి రాణించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై. లెనిన్, ఎన్టీపీసీ ఉద్యోగి చిలుక శంకర్ మరియు ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆశ్రమంలోని పిల్లలకు ఉత్సాహాన్ని నింపిందని, నూతన సంవత్సరంలో కొత్త ఆశలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇచ్చిందని పాల్గొన్నవారు తెలిపారు.

Leave a Reply