Fifa-World-Cup-2026 సూపర్ కంప్యూటర్ జోస్యం ఇదే..! Andhra Prabha Sports Story
Fifa-World-Cup-2026 సూపర్ కంప్యూటర్ జోస్యం ఇదే..! Andhra Prabha Sports Story
- ఫైనల్‌కు చేరేది ఈ రెండు జట్లేనా..?
- ఫ్రాన్స్ ఇంగ్లండ్ షేవరేట్లా
- స్పెయిన్ , అర్జెంటీనా సాకర్ పెద్దలు అంచనా
- కాదు.. మళ్లీ అర్జెంటీనా ఫ్రాన్స్ హైడ్రామా
- సాకర్ ప్రియుల లెక్కలు
(ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )
ఒక వైపు మరో విజయంతో నయా చరిత్ర సృష్టించటానికి మెస్సీ గ్యాంగ్,, అదే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా,, ఎట్టి పరిస్థితిలో.. గోల్డెన్ బూటుతో పాటు.. గోల్డెన్ బాల్ ;పట్టేయాలని.. అతడే ప్రాన్ష్ సాకర రణ సారధి కిలియన్ ఎంబాపే.. స్పెయిన్ సూపర్ సబ్ అస్త్రం .. లాస్ట్ మినిట్ మిరాకిల్ హీరో మెరీనో మైకెల్గం, ఒకరు కాదు ఇద్దరు స్ట్రయికర్లు హారీకేన్..జూడ్ బెల్లింగ్‌హామ్ బలంతో ఇంగ్లండు జట్టు .. కోటి ఆశలతో ఫిఫా టోర్నీ సెమీ ఫైనల్స్ లో తలపడుతున్నాయి.
2026 ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి సారిగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-4 స్థానాల్లో నిలి,చిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా , ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్, సెమీఫైనల్స్ హోరా హోరీ పోరుకు సన్నద్ధం అవుతున్నాయి. . మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్ రేసులో ఈ నాలుగు అగ్రశ్రేణి జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో రెడీ అంటున్నాయి. ఇక ఫైనల్స్ కు చేరే జట్టు ఏవీ? ఈ సెమీస్ లో గెలిచే టీమ్‌లపై యావత్ క్రీడాప్రపంచం అంచనాలు.. జోస్యాలతో బిబీబజీగా ఉంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ కు చేరుతాయని సూపర్ కంప్యూటర్ జోస్యం చెబితే.. ఈ పారి స్పెయిన్, అర్జెంటీనా ఫైనల్ లో పోటీపడుతాయని కొందరు ఫిపా అభిమానులు… కాదు.. ఫ్రాన్స్ , అర్జెంటీనా టీమ్ ల మధ్య మరో సారి హౌడ్రామా రిపీట్ అవుతుందని అత్యధిక మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎనీ హౌ మళ్లీ మెట్ లైఫ్ స్టేడియంలో .. మహా సంగ్రామం జరగబోతోంది. ఈ మహాసాకర్ సమరంలో తలబడే నాలుగు జట్ట బలం, వ్యూహం, ప్రతి వ్యూహం అంచనాలను పరిశీలిద్దాం.
Fifa-World-Cup-2026 ఫ్రాన్ప్ ఆరాటం
ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్ లో ఓటమి అంచుల్లో పోరాడి కేవలం ఒకే ఒక గోల్ తో గట్టెక్కి సెమీస్‌కు దూసుకొచ్చింది. ఈ జట్టుకు పెద్ద దిక్కు కిలియన్ ఎంబాపె భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఒంటరిగా 8 గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు. అతనికి తోడుగా ఉస్మాన్ డెంబెలే, మైకేల్ ఒలిసేల అటాకింగ్ లైన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రత్యర్థి డిఫెన్స్‌ను తమ అద్భుత వేగంతో ముక్కలు చేయడం, కౌంటర్ అటాక్స్‌లో మెరుపు వేగంతో గోల్స్ కొట్టడం వీరి శైలి. స్పెయిన్ మిడ్‌ఫీల్డ్‌ను కట్టడి చేసేందుకు ఫిజికల్ గేమ్‌ను నమ్ముకుంది. ఎట్టి సరిస్థితిలోనూ స్పెయిన్ వై విజయమే ఫ్రాన్స్ లక్ష్యం.
Fifa-World-Cup-2026 టిక్ టాకాతో స్పెయిన్ రెడీ
యూరో 2024 ఛాంపియన్స్ స్పెయిన్ తాజాగా గాయాల సమస్యలు ఉన్నప్పటికీ రిజర్వ్ బెంచ్ బలంతో సెమీస్ చేరింది. టోర్నమెంట్లో అత్యుత్తమ డిఫెన్స్ వీరి సొంతం. మిడ్ ఫీల్డర్ మైకెల్ మెరినో సూపర్సబ్గా మారి నాకౌట్ దశల్లో చివరి నిమిషాల్లో గోల్స్ కొట్టి జట్టును గెలిపించాడు. లమిన్ యమల్, నికో విలియమ్స్ వంటి యంగ్ స్టార్స్ జట్టుకు అదనపు బలం. సాంప్రదాయ ‘టికి-టాకా’ శైలిలో బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం స్పెయిన్ జట్టుకు తిరుగులేని వ్యూహం. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపెకు బంతి అందకుండా డిఫెన్సివ్ లైన్‌ను లాక్ చేయటమే స్సెయిన్ డిఫెండర్ల ప్రధాన లక్ష్యం.
Fifa-World-Cup-2026 ఇద్దరు హీరోలతో ఇంగ్లండ్ రెడీ
క్వార్టర్ ఫైనల్లో నార్వేపై ఎక్స్ట్రా టైమ్‌లో పోరాడి గెలిచిన ఇంగ్లండ్ టీమ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. కొత్త మేనేజర్ థామస్ టూఖెల్ ఆధ్వర్యంలో జట్టు సరికొత్త వ్యూహాలతో ఆడుతోంది. హ్యారీ కేన్ , జూడ్ బెల్లింగ్‌హామ్ బోర్గిని లాంటి కాంబినేషన్. ఇద్దరూ తలా 6 గోల్స్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నారు . పక్కా పాసింగ్ గేమ్ . సెట్-పీసెస్ (కార్నర్ కిక్స్, ఫ్రీ కిక్స్) తో గోల్స్ రాబట్టడం వ్యూహం కాగా.. అర్జెంటీనా అగ్రెసివ్ గేమ్‌ను ఎదుర్కొనేందుకు మిడ్‌ఫీల్డ్‌లో జూడ్ బెల్లింగ్‌హామ్ ఫిజికల్ హోల్డ్‌ను ఉపయోగించటం ఇంగ్లండ్ ప్రతివ్యూహం
Fifa-World-Cup-2026 ప్రతీకారం కోసం..అర్జెంటీనా..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా, క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను ఎక్స్ట్రా టైమ్‌లో 3-1తో ఓడించి సెమీస్‌కు చేరింది. లియోనెల్ మెస్సీ (Lionel మ్యాజిక్ టోర్నమెంట్లో అతని 8 గోల్స్. ఆయనతో పాటు జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్ వంటి వరల్డ్ క్లాస్ స్ట్రైకర్లు ఫామ్‌లో ఉన్నారు. మెస్సీ చుట్టూ ఆటను నిర్మించడం, ప్రత్యర్థి బాక్స్‌లోకి క్విక్ పాస్‌లు ఇస్తూ డిఫెన్స్‌ను గందరగోళానికి గురిచేయడం ప్రధాన వ్యూహం. ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక రైవల్రీ ప్రతీకారం నేపథ్యంతో వీరు మానసికంగా అత్యంత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇది సార్ పండితుల విశ్లేషణాత్మం అంచనా.
Fifa-World-Cup-2026 సెమీఫైనల్స్ షెడ్యూల్
భారత కాలమానం ప్రకారం)సెమీఫైనల్ 1: ఫ్రాన్స్ వెర్సెస్ స్పెయిన్
మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్ నగరంలోని AT&T స్టేడియం దీనిని ‘కౌబాయ్స్ స్టేడియం’ అని కూడా పిలుస్తారు. జూలై 15, బుధవారం తెల్లవారుజామున 12:30 గంటలకు జరుగుతుంది
సెమీఫైనల్ 2 ఇంగ్లండ్ వెర్సెస్ అర్జెంటీనా) మ్యాచ్ అట్లాంటా, జార్జియాలోని మెర్సిడెస్-బెంజ్ స్టేడియం లో జూలై 16, గురువారం తెల్లవారుజామున 12:30 గంటలకు.
జరుగుతుంది.
