సన్న రకాలు సాగు చేయండి..

రైతుల సంక్షేమం సర్కార్ ధ్యేయం..
మంత్రి లక్ష్మణ్ కుమార్..

గొల్లపల్లి, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ రైతు వేదిక లో విత్తన మేళ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత యాసంగి సీజన్ లో పెద్ద ఎత్తున వారి ధాన్యం, మొక్కజొన్న దిగుబడి వచ్చిందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేసినట్ల,కొనుగోలు చేసిన నాలుగయిదు రోజుల లోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసిందన్నారు. వానాకాలం సీజన్ లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు మాత్రమే రైతులు సాగు చేయాలన్నారు. గొల్లపల్లి మండలం శ్రీరాములు పల్లి గ్రామంలో రూ. 70 లక్షలతో ప్రమాదకరం గా ఉన్న కరెంట్ వైర్లు తొలగించినట్లు,గ్రామంలో ఐకేపీ సెంటర్ తో పాటు గ్రౌండ్ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు సంఘ భవనాలు పూర్తి చేస్తామన్నారు.