Market Committee| అలంపూర్ మార్కెట్‌లో ఆధిపత్య ‘పోరు’

Market Committee | అలంపూర్ మార్కెట్‌లో ఆధిపత్య ‘పోరు’

Market Committee | మానవపాడు, ఆంధ్రప్రభ : జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal district) అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ లో ప్రతి పక్షం, అధికార పార్టీల మద్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అధికార పార్టీ నుండి మార్కెట్ కమిటీ (Market Committee) గా మేమున్నాం అంటూ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు, స్థానిక సోసైటి కలుగొట్ల సహకార సంఘం ఉండగా మీరు ఎట్ల ప్రారంభం చేస్తారని ప్రతిపక్ష ఎమ్మెల్యే (MLA) ఒకవైపు, అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ లో మొక్కజొన్న కేంద్రం మా ద్వారానే ప్రారంభం కావాలని రెండు పార్టీల నాయకులు పట్టుబట్టడంతో ఇటు రైతులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలంపూర్ నియోజకవర్గ పరిధిలో అని మార్కెట్ లలో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం నెల పూర్తవుతున్నా అలంపూర్ చౌరస్తా మార్కెట్ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు.

Leave a Reply