రాటుదేలిన కేటుగాళ్లు.. ఈ ఇద్దరు రైస్ మిల్లర్లు

  • ఏకంగా ఏడు కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహా
  • ఇండస్ట్రీస్ పేరుతో మహా దోపిడీ
  • రాష్ట్రంలో 158 కోట్ల స్కామ్ను చేధించిన పోలీసులు
  • చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : ఇండస్ట్రీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ తప్పించు తిరుగుతున్న ఇద్దరు రైస్ మిల్లర్లను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భూక్య రామ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కరీంనగర్ కట్టరాంపూర్ భగత్ నగర్కు చెందిన సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతీ, అతని భాగస్వామిగా ఉన్న సౌఖ్యం అంజయ్యలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నివాసిలు. వీరిద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్తో సీఎంఆర్ ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకొ ని, 2023 సంవత్సరంలో 3116.360 మెట్రిక్ టన్నులు, 2024 లో 2119.125 మెట్రిక్, టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, నిధుల దుర్వినియోగం, అక్రమ వి క్రయాలకు పాల్పడ్డారని తెలిపారు.

కేవలం 515.558 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించి, మిగతా 1603.967 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని డెలివరీ చె యకుండా ఎగనామం పెట్టారన్నారు. బ్యాంకుల వద్ద రైస్ మిల్లుల పేరుతో అప్పులు తీసుకోవడం, సివిల్ సప్లై అధికారులకు తెలియకుండా ప్రభుత్వ ధాన్యాన్ని నిందితులు బహిరంగం మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు.

2020, 2025 సంవత్సరంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులతోపాటు పెద్దపెల్లి జిల్లా పౌరసరఫరాల అధికారులు నిల్వల తనిఖీలలొ 1088.014 వరి ధాన్యం తక్కువ ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. బాధితుడి అభ్యర్థన మేరకు తొంబై రోజులతోపాటు మరో మూడు నెలల గడువు ఇచ్చిన, ఇద్దరు నిందితులు అధికారులను నమ్మించి ఏడు కోట్ల నష్టం చేశారని తెలిపారు.

గతంలో బండారి మారుతి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీరాములపల్లి, ప్రభుత్వానికి 69 కోట్ల మోసం చేశారని, మహాశక్తి ఇండస్ట్రీస్ కోరపల్లి కి 62 కోట్లు, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ కాట్నపల్లికి 20 కోట్లు, మోసం చేశారని అన్ని కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి, సివిల్ సప్లై సంస్థను, ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

బండారి మారుతిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్, మోసాలు తదితర కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితులు బండారి మారుతి, సౌఖ్యం అంజయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టుతుండగా సోమవారం కరీంనగర్ కట్టరాంపూర్ జిమ్ములో ఇద్దరు నిందితులను సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐలు చాక చక్యంగా పట్టుకొని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డిసిపి రామ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఏ సీబీ కృష్ణ, సీఐ రంజిత్ రావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు చంద్రకుమార్, మధుకర్, మల్లేష్, సనత్ రెడ్డి అదనపు ఎస్సై అశోక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.