EXAMS | విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..

EXAMS | విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..
EXAMS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖి నిర్వహించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మోడీ తెలిపారు. మొబైల్ ఫోన్, టీవీలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు సూచించారు. మంచిదారిలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ఏఐ మేధస్సు కొత్త ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పరీక్షల తర్వాత ఐదు వెకేషన్ స్థలాలు సూచించాలని రాయ్‌పుర్ విద్యార్థి కోరారు. రైలులో వెళ్లడం వల్ల వివిధ వర్గాలను కలవడం మంచి అనుభూతి అని మోడీ అన్నారు.
