ప్రతి పండుగకు ఒక ప్రధాన దైవం ఉండదు. ఆ అవతారాలు పుట్టిన రోజునే వారు ప్రధాన దైవం. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయకచవితి, స్కన్ద షష్టి, రధసప్తమి, మహానవమి ఇలాంటి వాటికి ఆయా దేవతలు ప్రధానము. ఆనాడు కూడా మనం నిత్యం ఆరాధించే మన ఇష్టదైవాన్ని ఆరాదించిన తరువాతనే ఆ పుట్టిన రోజు దైవాన్ని పూజించాలి. నిత్య ఆరాధనను మానివేసి ప్రధాన దైవాన్ని ఆరాధించరాదు. ఉగాదినాడు కాలమే ప్రధాన దైవం. ఆనాడు మనము పూజించే దైవాన్ని కాలరూపంగా ఆరాధించాలి. పంచాంగాన్ని ఆరాధించాలి. పంచాంగం కాలరూపమే కదా!
ప్రతి పండుగకు ఒక ప్రధాన దైవం ఉంటుంది. మరి ఉగాదినాడు ప్రధాన దైవం ఎవరు?
