- విక్రయించినా.. వినియోగించినా కేసులు
- రామగిరి లో పలువురికి కౌన్సిలింగ్
రామగిరి, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అక్రమ గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు.
గంజాయిని నిర్మూలించడానికి రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో ప్రత్యేక నార్కోటిక్స్ యూనిట్లను ఏర్పాటు చేసి, గంజాయి అక్రమ రవాణా-అమ్మకాలపై నిఘా ఉంచారు.
ఇందులో భాగంగా ఈరోజు (శనివారం) నార్కోటిక్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ రాజేష్ లు రామగిరి పోలీసులతో కలిసి అక్కేపల్లి సమీపంలో గంజాయి వినియోగిస్తున్న పలువురిని అరెస్టు చేశారు.
వారిని రామగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించి , వారి తల్లిదండ్రులను పిలిపించి సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేసినా విక్రయించిన వినియోగించినా. కేసులు తప్పవని హెచ్చరించారు. యువత గంజాయికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును వృధా చేసుకోవద్దని సూచించారు.