Eluru | భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు

Eluru | భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు

  • ప్రారంభించిన.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సంక్రాంతి సంబరాలు ఏలూరు జిల్లాలో సందడిగా బుధవారం బ్రాహ్మి ముహూర్తం నుంచి మొదలయ్యాయి. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం దుగ్గిరాలలో జరిగిన భోగి మంటలు వేడుకల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని భోగి మంటలు నిర్వహించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Eluru

తొలుత తన అభిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్ టి రామారావు‌ విగ్రహానికి పూలమాలను సమర్పించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరితో, బంధుమిత్రులతో కలిసి గంగిరెద్దుల నృత్యాలను తిలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామస్తులు, బంధువులు అందరికీ గ్రూప్ ఫోటోలు కార్యక్రమం నిర్వహించారు.

Eluru
Eluru
Eluru

Leave a Reply